Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 28 August 2022, 9:18 pm Posted by : Anjaneyulu Dega

బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ బలవన్మరణం

మంచిర్యాల జిల్లా: చేసిన అప్పులు, దీనికి తోడు ఆరోగ్యం సహకరించకపోవడంతో జీవితంపై విరక్తి చెందిన టీఎస్ఎఎస్పీ హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. నీల్వాయి ఎస్సై నరేశ్, మృతుడి బంధువుల వివరాల ప్రకారం. వేమనపల్లి మండలం నీల్వాయి పోలీస్ స్టేషన్. లో. టీఎస్ఎఎస్పీ హెడ్ కానిస్టేబుల్ గా బాదావత్ ప్రకాశ్నాయక్ (42) ఇటీవలే బాధ్య తలు తీసుకున్నారు. రెండేళ్ల కిందట కూతురు సంధ్య వివాహం చేశారు. అయితే కొంత కాలంగా అతని ఆరోగ్యం బాగా లేకపోవడం, దీనికి తోడు అప్పులు ఉండటంతో ఎప్పుడూ మదనపడేవారు. ఈ క్రమంలో శనివారం ఆయన తెల్లవారుజామున పురుగుమందు తాగారు.

గమనించిన బెటాలియన్ సిబ్బంది కరీంనగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందారు. మృతుడికి భార్య సుశీల, కుమారుడు గణేశ్, కూతురు ఉన్నారు. ప్రకాశ్ నాయక్ స్వగ్రామం జన్నారం మండలం మొర్రిగూడ. చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో శవ పంచనామా నిర్వహించారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.