తహసిల్దార్ కార్యాలయంలో తప్పిన ముప్పు
నిర్మల్ జిల్లా: జిల్లా కేంద్రంలోని అర్బన్ తహసిల్దార్ కార్యాలయంలో ప్రమాదం జరిగింది. ఇటీవల కురిసిన వర్షాలకు కార్యాలయ పైకప్పు పెచ్చులు ఊడిపోయాయి. భయాందోళనలకు గురైన సిబ్బంది కార్యాలయం నుండి బయటకు వచ్చారు. వివరాల్లోకి వెళ్తే. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో గోడ ఒక్కసారిగా కూలింది. అయితే అధికారులు మాత్రం కార్యాలయం లోపల పనిచేస్తుండగానే ఈ సంఘటన చోటు చేసుకుంది. పై కప్పు కూలిన సమయంలో ప్రజలు ఆ ప్రదేశంలో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ కార్యాలయాన్ని 1928 సంవత్సరంలో నిర్మించారు. అప్పటి...