Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 26 August 2022, 8:30 am Posted by : Anjaneyulu Dega

శాంతిభద్రతలపై సమీక్ష సమావేశం..

మత సామరస్యానికి భంగం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి

ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్

కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా: నిందితులపై మోపిన అభియోగాలు న్యాయస్థానంలో రుజువు కావాలంటే దర్యాప్తులో మరింత నాణ్యత పెంచాల్సిన అవసరం ఉందని జిల్లా ఎస్పీ కే. సురేష్ కుమార్ పేర్కొన్నారు. గురువారం స్థానిక పోలీసు ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లా పోలీసు అధికారులతో శాంతిభద్రతలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలోని పోలీసు అధికారులు అందరూ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా అనేక అంశాలపై చర్చించారు. పోలీస్ స్టేషన్ ల వారిగా పెండింగ్ లో ఉన్న కేసుల దర్యాప్తు వివరాలను ఎస్. హెచ్. ఒ లను అడిగి వివరణ తీసుకున్నారు. దీర్ఘకాలికంగా వివిధ కారణాలతో పెండింగ్ లో కేసులను త్వరగా దర్యాప్తు పూర్తి చేసి పరిష్కరించాలని సూచించారు. గ్రేవ్ కేసెస్, నాన్ గ్రేవ్ కేసెస్, మాదకద్రవ్యాల, పోక్సో యాక్ట్, పలు అంశాలపై ప్రత్యేకంగా చర్చించడం జరిగింది. సంచలనం సృష్టిస్తున్న కేసులలో జిల్లా సాంకేతిక నిపుణులు సి. సి. ఎస్ పోలీసుల సహాయం తీసుకొని త్వరగా పరిష్కరించాలని సూచించారు.

అదే విధంగా జిల్లాలో గంజాయి సాగు, సరఫరా, వినియోగంపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఆసిఫాబాద్ జిల్లాను గంజాయి రహిత జిల్లాగా చేయడానికి కృషి చేయాలన్నారు. పోలీస్ స్టేషన్ ల వారీగా సిబ్బంది అందరికీ అవగాహన కార్యక్రమం చేపట్టి పూర్తి బాధ్యత వహించి ప్రతి ఒక్క పోలీసు గంజాయి నిర్మూలన చేయడానికి కృషి చేయాలని సూచించారు. మత సామరస్యానికి భంగం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండేలా చూసుకోవాలని అధికారులకు తెలియజేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగిన డయల్ 100 కు కాల్ చేసేలా, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, పోలీస్ కళాబృందం ద్వారా సామాజిక రుగ్మతలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఎస్పీ పేర్కొన్నారు.

ఈ సమావేశంలో అదనపు ఎస్పీ అడ్మిన్ అచ్చెశ్వర రావు, అదనపు ఎస్పీ ఏఆర్ భీమ్ రావు, డీఎస్పీలు శ్రీనివాస్, కరుణాకర్, సీఐ లు, ఎస్ఐ లు, జిల్లాలోని పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు..