జూనియర్ లైన్మెన్ పరీక్ష రద్దు.. త్వరలో కొత్త నోటిఫికేషన్
హైదరాబాద్: తెలంగాణలో టీఎస్ఎస్పీడీసీఎల్ జూనియర్ లైన్మెన్ పరీక్ష రద్దు చేశారు. 1000 పోస్టులకు జులై 17న రాత పరీక్ష నిర్వహించగా.. 181 మంది అభ్యర్థులు మాల్ ప్రాక్టీస్ పాల్పడినట్లు హైదరాబాద్, రాచకొండ పోలీసుల విచారణలో నిర్ధారణ అయింది. ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని అంచనా. ఘట్కేసర్ పరీక్ష కేంద్రంలో ఓ అభ్యర్థి చరవాణితో చిక్కడంతో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. తమకు సమాధానాలు చెబుతామని రూ. లక్షలు తీసుకుని మోసం చేశారని కొందరు ఉద్యోగులపై ఓ అభ్యర్థి అంబర్పేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు...