ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి

మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి మంచిర్యాల జిల్లా: జిల్లాలోని 16 మండలాలలోని ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడంలో భాగంగా 164 గ్రామపంచాయతీలను ఓ.డి.ఎఫ్. ప్లస్ గ్రామపంచాయతీలుగా ప్రకటించడం జరిగిందని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి నరేందర్, బెల్లంపల్లి రాజస్వ మండల అధికారి శ్యామలాదేవి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బి. శేషాద్రితో కలిసి ఆదర్శ గ్రామాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ...