ఓటర్ల జాబితా సవరణ పకడ్బంధీగా చేపట్టాలి.
సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి టి. రవికిరణ్ మంచిర్యాల జిల్లా: సంక్లిప్త ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంను ఎన్నికల అధికారులు ఎలాంటి తప్పులు లేకుండా పూర్తి స్థాయిలో పకడ్బంధీగా చేపట్టాలని సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి టి. రవికిరణ్ అన్నారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఓటర్ల జాబితా తయారీలో సంబంధిత అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని, బూత్ స్థాయి అధికారులు వారి పరిధిలోని ఓటర్ల...