Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 24 August 2022, 7:11 am Posted by : Anjaneyulu Dega

ఓటర్ల జాబితా సవరణ పకడ్బంధీగా చేపట్టాలి. 

సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి టి. రవికిరణ్

మంచిర్యాల జిల్లా: సంక్లిప్త ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంను ఎన్నికల అధికారులు ఎలాంటి తప్పులు లేకుండా పూర్తి స్థాయిలో పకడ్బంధీగా చేపట్టాలని సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి టి. రవికిరణ్ అన్నారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఓటర్ల జాబితా తయారీలో సంబంధిత అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని, బూత్ స్థాయి అధికారులు వారి పరిధిలోని ఓటర్ల వివరాలను పూర్తి స్థాయిలో ఎలాంటి తప్పులు లేకుండా సేకరించాలని తెలిపారు. ఫారం-6బి ద్వారా వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి త్వరగా ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు. ఆయా జిల్లాలోని పోలింగ్ కేంద్రాలను ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా జనాభా ప్రాతిపదికన క్రమబద్దీకరించి తదనుగుణంగా జాబితా తయారు చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, ఎన్నికల డి.టి. శ్రీనివాస్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.