Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 24 August 2022, 7:46 am Posted by : Anjaneyulu Dega

గ్రామ కార్యదర్శి సస్పెండ్..!!

సస్పెండ్ చేస్తూ  ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ భారతి హొళీ కెరీ

మంచిర్యాల జిల్లా: జన్నారం మండలం రాంపూర్ గ్రామ కార్యదర్శి గంగారాం ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ భారతి హోళీ కేరి ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 20వ తేదీన రాంపూర్ గ్రామ దళిత మహిళా సర్పంచ్ పై చేయి చేసుకున్న సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. దీనిపై జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జన్నారం మండలం ఎంపీడీవో సమగ్ర విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు.

ఎంపీడీవో నివేదిక ఆధారంగా అన్ని కోణాలలో పరిశీలించి రాంపూర్ గ్రామ కార్యదర్శి ని సస్పెండ్ చేస్తున్నట్లు మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళీ కేరి మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.