బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి మృతి.. ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత
బాసర: నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి తండాకు చెందిన సురేశ్ రాథోడ్ ఆర్జీయూకేటీలో ఇంజినీరింగ్ ఫస్టియర్ చదువుతున్నాడు. మంగళవారం మధ్యాహ్నం వసతి గృహంలో ఫ్యాన్ కు ఉరి వేసుకున్నాడు. మధ్యాహ్నం అతని స్నేహితులు గదికి వెళ్లే సరికి లోపలి నుంచి తాళం వేసి ఉంది. అనుమానంతో తలుపులు బద్దలుకొట్టి చూడగా.. సురేశ్ ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించాడు. వెంటనే నిర్మల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే విద్యార్థి...