ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్ల ఖరారు..

హైదరాబాద్: రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం ఇంజినీరింగ్ కాలేజీల్లో 45 కోర్సుల్లో 65,633 సీట్లు కన్వీనర్ కోటాలో అందుబాటులో ఉండనున్నాయి. జేఎన్టీయూహెచ్, ఓయూ, కేయూ అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. అత్యధికంగా సీఎస్ఈలో 17,154, ఈసీఈలో 11,375, సీఎస్ఈ ఏఐఎంఎల్ 7,032 సీట్లకు యూనివర్సిటీలు అనుమతిచ్చాయి. గత విద్యాసంవత్సరంతో పోలిస్తే కాలేజీలు, సీట్లు పెరగకపోయినప్పటికీ... పలు కాలేజీలు సివిల్, మెకానికల్, ట్రిపుల్ వంటి డిమాండ్ తక్కువ ఉన్న సీట్లను వెనక్కి ఇచ్చి సీఎస్ఈ, ఏఈఎంల్, ఐటీ వంటి కోర్సుల్లో పెంచుకున్నాయి. కన్వీనర్ కోటాలో 70శాతం,...