దిల్లీ లిక్కర్ స్కామ్ తో నాకు సంబంధం లేదు: ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్: ఢిల్లీ మద్యం కుంభకోణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెరాస ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. దిల్లీ భాజపా నేతలు చేసిన ఆరోపణలపై ఆమె స్పందించారు. తనపై నిరాధార అరోపణలు చేస్తే సహించేది లేదని కవిత హెచ్చరించారు. దేశవ్యాప్తంగా కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి చేస్తున్న సహస్ర చండీయాగం, పూర్ణాహుతికి కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ ఆమె వివరణ ఇచ్చారు. "కుమార్తెను బద్నాం చేస్తే.. కేసీఆర్ వెనక్కి...