Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 21 August 2022, 4:24 pm Posted by : Anjaneyulu Dega

హైదరాబాద్ చేరుకున్న అమిత్ షా.. ఉజ్జయిని మహంకాళికి ప్రత్యేకపూజలు

హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమితా షా హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో ఆయనకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డీ తో పాటు ముఖ్యనేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి ఆలయానికి అమిత్ షా వెళ్లారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం సాంబమూర్తినగర్ లో భాజపా కార్యకర్త సత్యనారాయణ ఇంటికి ఆయన వెళ్లారు. అమిల్షా పర్యటన నేపథ్యంలో ఉజ్జయిని మహంకాళి పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

అమితా షా హైదరాబాద్ లో కార్యక్రమాలను ముగించుకుని మునుగోడు బయల్దేరనున్నారు. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భాజపాలో చేరనున్న నేపథ్యంలో ఆ పార్టీ మునుగోడులో భారీ బహిరంగసభ నిర్వహిస్తోంది. ఆ సభలో అమితా షా సమక్షంలో రాజగోపాల్ రెడ్డి కాషాయ కండువా కప్పుకోనున్నారు..