Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 20 August 2022, 4:34 pm Posted by : Anjaneyulu Dega

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

మంచిర్యాల జిల్లా: కేంద్రంలో శనివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 78వ  జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.మాజీ ఎమ్మెల్సీ  కొక్కిరాల  ప్రేమ్ సాగర్ రావు గారి నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ గారు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సురేఖ గారు మాట్లాడుతూ దేశానికి రాజీవ్ గాంధీ అందించిన సేవలను కొనియాడారు. భారతదేశం అభివృద్ధి చెందుతుంది అంటే అప్పటి రాజీవ్ గాంధీ దీర్ఘకాలిక ఆలోచనలు, వ్యూహాలతోనే అని అలాగే యువత రాజకీయాల్లోకి రావాలి అని 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించడం జరిగిందని అన్నారు. ఈరోజు దేశంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందుతుంది అంటే రాజీవ్ గాంధీ వల్లనే అని అన్నారు.

ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు తూముల నరేష్,  RGPRS జిల్లా అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి, పట్టణ ఉపాధ్యక్షులు జోగుల సదానందం, మహిళ జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత, పట్టణ అధ్యక్షురాలు గజ్జెల హేమలత, మెనం లక్ష్మి, స్రవంతి,లలిత,పద్మ,  కొండ చంద్రశేఖర్, బొల్లం భీమయ్య, పెంట రమేష్, తదితరులు పాల్గొన్నారు.