Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 20 August 2022, 2:45 pm Posted by : Anjaneyulu Dega

బాధిత కుటుంబాల పిల్లలకు స్కూల్ కిట్స్ పంపిణీ

పిల్లలకు స్కూల్ కిట్స్ అందజేస్తున్న బిజెపి జిల్లా అధ్యక్షులు రఘునాథ్

మంచిర్యాల జిల్లా: మంచిర్యాల పట్టణంలోని ఎన్టీఆర్ నగర్, ఎల్ఐసి కాలనీ, పద్మశాలి కాలనీ, గణేష్ నగర్ మరియు పాత మంచిర్యాల లో ఇటీవల వచ్చిన వరదల వలన నష్టపోయిన కుటుంబాల 200 మందికి పైగా స్కూల్ విద్యార్థులకు సేవ సహయోగ్ ఫౌండేషన్ సహకారంతో బిజెపి జిల్లా అధ్యక్షులు రఘునాథ్ స్కూల్ బ్యాగుల, బుక్స్ అందించడం జరిగింది.

ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ… వరద బాధితులకు తాము ఎల్లపుడూ సహకారం అందించి వారికి అండగా ఉంటామని అన్నారు. అందులో భాగంగానే ఈరోజు స్కూల్ విద్యార్థులకు స్కూల్ బ్యాగుల మరియు నోట్ బుక్స్ పంపిణీ చేయడం జరిగింది అని అన్నారు. వరదల వలన స్కూల్ విద్యార్థుల యొక్క పుస్తకాలు తడవడం తో పేద విద్యార్థులకు తాము అండగా ఉండి వారికి స్కూల్ కిట్స్ అందించడం జరిగింది అని. వరద బాధితులకు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వారికి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు… ఈ కార్యక్రమంలో సేవ భారతి సభ్యురాలు రజిని, రజినిష్ జైన్, వెంకటేశ్వర్ రావు, బొద్దున మల్లేష్, గాజుల ప్రభాకర్, బియ్యాల సతీష్ రావు, పట్టి వెంకట కృష్ణ, అమిరిషెట్టీ రాజు, నాగుల రాజన్న, పల్లి రాకేష్, తోట తిరుపతి, రాచకొండ సత్యనారాయణ, విఘ్నేష్ మరియు తదితరులు పాల్గొన్నారు..