
మిఠాయిలు పంచి, సంబరాలు చేసుకున్న కార్మికులు
పోరాటంలో పాల్గొన్న కార్మికులకు జేజేలు
ఆదిలాబాద్ జిల్లా సీఐటీయు నాయకులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి.
సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్
మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వం ఆసుపత్రి ఆవరణలో సెంటర్ అఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయు) ఆధ్వర్యంలో శనివారం రోజున వేతనాల పెంపుపై అభినందన సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్బంగా దుంపల రంజిత్ కుమార్ సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ… ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ద్వారా వివిధ భాగాలలో పని చేస్తున్న వర్కర్స్ కి వేతనాలు పెంచలనే పోరాటం చేసి జీవో 60 ని సాధించుకోవడం జరిగింది. కానీ సదరు కాంట్రాక్టర్ ఈ జీవో ను అమలు చేయకపోవడంతో కొన్ని నెలల నుండి సిఐటి ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహించడం జరిగింది. ఈ మధ్యకాలంలో సిఐటియు ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లాలో చేసే పోరాటంలో సిఐటియు నాయకులు పై పోలీసులు అక్రమ కేసులు బనాయించారు. వెంటనే సిఐటియు నాయకుల పై పెట్టిన కేసులు ఎత్తివేయాలి. అదేవిధంగా ఆస్పత్రిలో పనిచేస్తున్న ప్రతి వర్కర్లకి పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించి,ఐడి కార్డులు యూనిఫాంలో వెంటనే ఇవ్వాలి. పెరిగిన వేతనం ప్రతి ఒక్కరికి అకౌంట్ లో జమ చేయాలని సిఐటియు గా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు చిప్పకుర్తి కుమార్,నరేష్,లక్ష్మి,శ్యామల, సంధ్య తదితరులు పాల్గొన్నారు.