రూ.8 వేలిస్తే.. రూ.50వేలు
అంతర్రాష్ట్ర నకిలీ నోట్ల ముఠా సభ్యుల అరెస్టు నకిలీ నోట్లు ప్రదర్శిస్తున్న డీసీపీ సాయిచైతన్య హైదరాబాద్: జిరాక్స్ సెంటర్ మాటున నకిలీ కరెన్సీ ముద్రించి హైదరాబాద్ సహా వేర్వేరు నగరాల్లో చలామణి చేస్తున్న ముఠా గుట్టును నగర పోలీసులు ఛేదించారు. కర్ణాటక కేంద్రంగా నడుస్తున్న ఈ ముఠాలోని ఇద్దరు సభ్యుల్ని ఎంజీబీఎస్ దగ్గర దక్షిణ మండల టాస్క్ఫోర్స్, మీర్ చౌక్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకరు హైదరాబాదీ ఉన్నారు. వీరినుంచి రూ.2.5 లక్షల (100, 200, 500, 2వేల నోట్లు) నకిలీ నోట్లను...