ఎస్కలేటర్ దిగుతూ కింద పడిన విద్యార్థులు

అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని పరామర్శిస్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి 12 మంది పిల్లలు, ఓ ఉపాధ్యాయురాలికి గాయాలు గాంధీ సినిమా ప్రదర్శిస్తున్న హైదరాబాద్ ఆర్కే సినీప్లెక్స్ లో ఘటన హైదరాబాద్: స్వతంత్ర భారత వజోత్సవాల్లో భాగంగా ప్రదర్శిస్తున్న 'గాంధీ' చిత్రాన్ని వీక్షించేందుకు వచ్చిన విద్యార్థులు ఎస్కలేటర్ దిగుతూ పడిపోయి గాయపడిన ఘటన హైదరాబాద్ లో కలకలానికి కారణమైంది. ఈ ఘటనలో ఓ ఉపాధ్యాయురాలూ గాయపడ్డారు. జూబ్లీహిల్స్ భారతీయ విద్యా భవన్స్ పబ్లిక్ స్కూల్ కు చెందిన విద్యార్థులు 'గాంధీ' చిత్రాన్ని వీక్షించేందుకు...