స్వాతంత్ర్య ఉద్యమంలో కవులు, రచయితల పాత్ర అనిర్వచనీయం
మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ మంచిర్యాల జిల్లా: బ్రిటీష్ బానిన పాలన నుండి దేశానికి స్వాతంత్ర్యం సాధించడంలో ఎందరో మహానుభావులు, పోరాటయోధులు చేసిన పోరాటాలతో పాటు ప్రజలను చైతన్యపర్చడంలో కవులు, రచయితలు పోషించిన పాత్ర అనిర్వచనీయమని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ మహోత్సవంలో భాగంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న వేడుకలలో భాగంగా మంగళవారం రోజున జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలోని సైన్స్ సెంటర్ లో ఏర్పాటు చేసిన కవిసమ్మేళనం కార్యక్రమానికి...