Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 16 August 2022, 10:56 pm Posted by : Anjaneyulu Dega

స్వాతంత్ర్య ఉద్యమంలో కవులు, రచయితల పాత్ర అనిర్వచనీయం

మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్

మంచిర్యాల జిల్లా: బ్రిటీష్ బానిన పాలన నుండి దేశానికి స్వాతంత్ర్యం సాధించడంలో ఎందరో మహానుభావులు, పోరాటయోధులు చేసిన పోరాటాలతో పాటు ప్రజలను చైతన్యపర్చడంలో కవులు, రచయితలు పోషించిన పాత్ర అనిర్వచనీయమని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ మహోత్సవంలో భాగంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న వేడుకలలో భాగంగా మంగళవారం రోజున జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలోని సైన్స్ సెంటర్ లో ఏర్పాటు చేసిన కవిసమ్మేళనం కార్యక్రమానికి మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్రావు, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లుతో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్య సాధనలో, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కవులు ముఖ్యమైన పాత్ర పోషించారని, సమాజ అభివృద్ధిలో కవులు ఎంతో విలువైన వారని అన్నారు. వజోత్సవాల ప్రాధాన్యత, దేశభక్తి, స్వతంత్ర ఉద్యమ ప్రస్థానం, ప్రాణాలు అర్పించిన సైనికుల త్యాగాలు, మహాత్మ గాంధీ స్పూర్తి, దేశ నాయకులను స్మరిస్తూ వినిపించిన వైవిధ్య భరిత కవిత గానాలు అలరించాయని, కవి నమ్మేళనానికి 75 మంది కవులు ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు గుండేటి యోగేశ్వర్, కొండు జనార్ధన్, అల్లాడి శ్రీనివాన్, బొల్లవరం జగన్మోహన్ రావు, ఆరె శ్రీనివాన్ వర్మ, కవులు తదితరులు పాల్గొన్నారు.