
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 39 మంది భద్రతా సిబ్బంది ప్రయాణిస్తోన్న ఓ బస్సు నదిలో బోల్తాపడింది. ఈ ఘటనలో ఆరుగురు సైనికులు మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను ఎయిర్ అంబులెన్స్ శ్రీనగర్ కు తరలించారు. ఈ భద్రతా సిబ్బంది అమర్ నాథ్ యాత్ర విధులను ముగించుకుని చందన్వారీ నుంచి పహల్గామ్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రమాదం సమయంలో బస్సులో 37 మంది ఇండో-టిబెటెన్ బోర్డర్ పోలీసులు(ఐటీబీపీ), ఇద్దరు జమ్ముకశ్మీర్ పోలీసులు ఉన్నారు. బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో బస్సు రోడ్డు మీద నుంచి నదిలో పడిందని ఐటీబీపీ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..