
మంచిర్యాల జిల్లా: పౌర్ణమిని పురస్కరించుకుని, వాసవీ క్లబ్ జిల్లా గవర్నర్ బాల సంతోష్ జన్మదినోత్సవం సందర్భంగా శుక్రవారం మంచిర్యాల రైల్వే స్టేషన్ లో పేదలకు అన్నదానం చేశారు. తోట వసంత రాజయ్య దంపతుల సహకారంతో అన్నదానం నిర్వహించారు. మంచిర్యాల వాసవీక్లబ్ అధ్యక్షులు కేశెట్టి వంశీకృష్ణ.. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ.. వాసవీక్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను విరివిగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వాసవీ క్లబ్ అంతర్జాతీయ ఉపాధ్యక్షులు కటుకం హరీష్, జిల్లా క్యాబినెట్ కోశాధికారి పుల్లూరి బాలమోహన్, రీజియన్ ఛైర్మన్ వుత్తూరి రమేష్, జోన్ చైర్మన్ కాచం సతీష్, సభ్యులు చందూరి ప్రభాకర్, నలుమాసు రమేష్, రమేష్, కొత్త కృష్ణ, పడకంటి లింగమూర్తి, అనీల్, తదితరులు పాల్గొన్నారు.