
మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్
మంచిర్యాల జిల్లా: స్వతంత్ర భారత వజ్రోత్సవ మహోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ఎ. ప్రేమ్ కుమార్ తో కలిసి రేషన్ డీలర్లు, గ్యాస్ డీలర్లు, పెట్రోల్ బంక్ డీలర్లు, రైస్ మిల్లర్లతో వేడుకల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. వజ్రోత్సవ మహోత్సవంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అందించిన కార్యచరణ ప్రకారంగా ప్రతి రోజు ప్రత్యేక కార్యక్రమంతో వేడుకలు నిర్వహించాలని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు చమురు సంస్థల పెట్రోల్ బంకులు, ఎల్.పి.జి. ఏజెన్సీలు తీవ్రర్ణంతో కూడిన దీపాలంకరణ చేయాలని, చమురు సంస్థలకు సంబంధించి సేల్స్ అధికారులు, ఎల్.పి.జి. డీలర్లు, పెట్రోల్ బంక్ డీలర్లు, రేషన్ డీలర్లు వేడుకలలో పాల్గొని ఈ నెల 22వ తేదీ వరకు చేపట్టవలసిన కార్యక్రమాలను విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు..