రెండిళ్లు.. 20 రోజులు..కరెంట్ బిల్లు రూ.1,75,706

రెండు బల్బులు, ఒక ఫ్యాన్ కు రూ.వేలల్లో బిల్లులు మా ఇల్లు అమ్మినా బకాయి తీరదు లబ్ధిదారులు తెలంగాణ: నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో రెండు ఇళ్లకు ఏకంగా రూ.1,75,706ల కరెంట్ బిల్లులు రావడంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. మండల కేంద్రానికి చెందిన నల్ల వెళ్లి పుల్లయ్య ఇంటికి గత నెల 16 నుంచి ఈ నెల 5 వరకు 8672 యూనిట్లు రీడింగ్ తిరిగినట్లు రూ.87,338 బిల్లు వేశారు. నల్లవెళ్లి నిరంజన్ ఇంటికి 20 రోజులకు 8793 యూనిట్లు తిరిగినట్లు రూ.88,368 బిల్లు...