అధికారుల అలసత్వం రైతులకు నష్టం.!
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా: రెబ్బెన మండలంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా రైతులకు పంపిణీ చేసే ఎరువుల విషయంలో అలసత్వం వహిస్తున్న అధికారులపై చర్య తీసుకోవాలని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కు పీఏసీఎస్ చైర్మన్ కర్నాతం సంజీవ్ కుమార్, వైస్ చైర్మన్ రంగు మహేష్ గౌడ్ వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. రెబ్బెన మండలంలో రైతులకు ప్రతి సంవత్సరం ఎరువుల పంపిణీ సకాలంలోనే సప్లయ్ చేసేవారని, కానీ ఈ సంవత్సరం వర్షాకాలం ప్రారంభమయ్యి రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటి...