స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గాంధీ చిత్రం ప్రదర్శించాలి
మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి మంచిర్యాల జిల్లా: ఆజాది కా అమృత్ మహోత్సవ్ - 75 కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని అన్ని సినిమా థియేటర్లలో గాంధీ చిత్రం ప్రదర్శించాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలోని కలెక్టర్ చాంబర్ సినిమా థియేటర్ల యజమానులు, నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలలో దేశభక్తి పెంపొందించేలా, స్వాతంత్ర్యం సాధించడంలో దేశభక్తులు చేసిన వీరోచిత పోరాటాలు, చేసిన త్యాగాల వివరాలు తెలియజేసే ఉద్దేశ్యంతో ప్రభుత్వం...