Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 05 August 2022, 7:09 am Posted by : Anjaneyulu Dega

కెసిఆర్ కు సమస్యలను వివరించిన ఎమ్మెల్యే

మంచిర్యాల జిల్లా: బెల్లంపల్లి నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరించాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కోరారు. ఈ మేరకు హైదరాబాదులోని ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను ఆయన కలిసి నియోజకవర్గ పరిస్థితిని వివరించారు.

సింగరేణి పట్టాలు ఇవ్వాలని కోరారు. ఇటీవల భారీ వర్షాలకు నష్టపోయిన బాధితులకు నష్టపరిహారం అందించాలని తెలిపారు. సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే చిన్నయ్య తెలిపారు.