భాజపాలో చేరేది వీరే: ఈటల రాజేందర్

హైదరాబాద్: తెరాస సర్కార్ ప్రజల విశ్వాసం కోల్పోయింది కాబట్టే ఉద్యమకారులు ఒక్కొక్కరూ బయటకు వస్తున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అంతరించిపోవడంతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యవహారం నచ్చక ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్, తెరాస నుంచి పెద్ద ఎత్తున భాజపాలో చేరికలు ఉంటాయన్నారు. ఈనెల 21న అమిత్ షా సమక్షంలో కన్నెబోయిన రాజయ్య యాదవ్, ఎర్రబెల్లి ప్రదీప్ రావు, దాసోజు శ్రవణ్ పాటు మరికొంత మంది కాషాయ తీర్థం పుచ్చుకునే ఆస్కారం...