ORRపై వాహనాలను చూడొచ్చా?.. కమాండ్ కంట్రోల్ నిపుణులకు కేసీఆర్ ప్రశ్నలు
కమాండ్ కంట్రోల్ కేంద్రంలో వీడియోవాల్ ను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్: కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం సందర్భంగా లోపల విభాగాలను సీఎం కేసీఆర్ ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు. కేంద్రంలో ఏకకాలంలో లక్ష కెమెరాలను చూసేందుకు వీలుందని పోలీస్ అధికారులు సీఎంకు వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్, యాదాద్రి దేవాలయం, హైదరాబాద్, వరంగల్.. ఇలా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను అనుసంధానం చేశామని చెబుతూ ఇక్కడి కమాండ్ కంట్రోల్ నుంచే సాంకేతిక నిపుణులు తెరపై సీఎం కేసీఆర్ కు చూపారు. ఔటర్ రింగ్...