
టీఆర్‌ఎస్-బీజేపీ బాహాబాహీ!
కరీంగనగర్ జిల్లా: హుజూరాబాద్ టీఆర్‌ఎస్-బీజేపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. హుజురాబాద్‌లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఇరు పార్టీల కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ఘర్షణ వాతావరణం సృష్టించారు. ఫ్లెక్సీల అంశానికి సంబంధించి గురువారం సాయంత్రం ప్రాంతంలో టీఆర్‌ఎస్-బీజేపీ కార్యకర్తలు బహిరంగ చర్చ సవాళ్లతో హంగామా సృష్టించారు.
ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తతలకు దారి తీసింది.