కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభించిన సీఎం కేసీఆర్
హైదరాబాద్: ఏడెకరాల విస్తీర్ణం.. నాలుగు టవర్లు.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం.. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ లో నిర్మితమైన పోలీసు కమాండ్ కంట్రోల్ కేంద్ర అందుబాటులోకి వచ్చింది. కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహబూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు....