Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 02 August 2022, 11:17 am Posted by : anjudega

తెరాస ఎమ్మెల్యే హత్యకు సర్పంచ్ భర్త కుట్ర..?

హైదరాబాద్: తెరాసకు చెందిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై హత్యకు కుట్ర జరిగింది. బంజారాహిల్స్ రోడ్ నం-12 వేమూరి ఎన్ క్లేవ్ లోనీ ఆయన నివాసం వద్ద కల్లెడ గ్రామానికి చెందిన సర్పంచ్ భర్త ప్రసాద్ గౌడ్ ఈ హత్యకు కుట్రపన్నారు. జీవన్ రెడ్డి ఇంటి వద్ద ఆయుధాలతో అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో ఎమ్మెల్యే సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో బంజారాహిల్స్ టాస్క్ఫోర్స్ పోలీసులు అక్కడికి చేరుకుని ప్రసాద్ గౌడ్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

అతడి వద్ద కత్తి, తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన భార్యను సర్పంచ్ పదవి నుంచి సస్పెండ్ చేసే విషయంలో ఎమ్మెల్యేపై ప్రసాద్ గౌడ్ కక్ష పెంచుకున్నట్లు సమాచారం.