దళితబంధు ద్వారా అర్హులైన ప్రతి దళితుడికి లబ్ది.!
మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి మంచిర్యాల జిల్లా: దళితుల అభ్యున్నతి దిశగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం ద్వారా అర్హులైన లబ్దిదారుడికి వర్తింపజేసేందుకు అధికార యంత్రాంగం కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో రాష్ట్ర దళితబంధు సలహాదారు లక్ష్మారెడ్డితో కలిసి దళితబంధు లబ్దిదారుల అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి దళిత కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం దళితబంధు పథకం ద్వారా...