న్యాయవాది దారుణ హత్య.. కారులో వెంబడించి.. కత్తులతో పొడిచి..
ములుగు కలెక్టర్ కార్యాలయానికి వచ్చి వెళుతుండగా ఘటన భూవివాదాలే కారణమని సమాచారం! ములుగు: హనుమకొండకు చెందిన న్యాయవాది మూలగుండ్ల మల్లారెడ్డి (58) దారుణ హత్యకు గురయ్యారు. భూ సమస్యపై ములుగు కలెక్టర్ కార్యాలయానికి వచ్చి సోమవారం సాయంత్రం 6:30 సమయంలో తిరిగి హనుమకొండకు వెళుతుండగా గుర్తుతెలియని దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. కారు డ్రైవర్ సారంగం, ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు మండలం పందికుంట బస్ స్టేజీ సమీపంలో స్పీడు బ్రేకర్ల వద్ద మల్లారెడ్డి వాహనాన్ని వెనుక మరో కారులో...