జిల్లాలో వివిధ శాఖలకు సిబ్బంది పునర్విభజన

మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి మంచిర్యాల జిల్లా: జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలకు గ్రామ రెవెన్యూ అధికారులు (వి.ఆర్.ఓ.)లను కేటాయిస్తూ పునర్విభజన చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ తో కలిసి వివిధ శాఖలకు ప్రభుత్వ ఆదేశాల మేరకు సిబ్బంది కేటాయింపు ప్రక్రియ లాటరీ పద్ధతిన పూర్తి చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో జిల్లా, డివిజనల్, మండల స్థాయి కార్యాలయాలలో...