ప్రధాని నివాసాన్ని ముట్టడించనున్న కాంగ్రెస్!

దిల్లీ: ధరల పెరుగుదల, నిరుద్యోగంపై కాంగ్రెస్ గళమెత్తనుంది. ఆగస్టు 5న దేశవ్యాప్తంగా నిరసనలు తెలపనుంది. పార్లమెంట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ర్యాలీగా వెళ్లిన అనంతరం ప్రధాని మోదీ నివాసాన్ని చుట్టుముట్టనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. పార్లమెంట్ ని లోక్సభ, రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించే కాంగ్రెస్ నేతలు ముందుగా పార్లమెంట్ వద్దకు చేరుకొని రాష్ట్రపతి భవన్ కు ర్యాలీగా వెళ్లి అక్కడ నిరసన తెలపనున్నారు. అక్కడి నుంచి ప్రధాని నివాసాన్ని ముట్టడించనున్నారు. రాష్ట్రాల్లో గవర్నర్ల ఇంటి వద్ద వద్ద కూడా కాంగ్రెస్ శ్రేణులు...