Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 30 July 2022, 4:57 pm Posted by : Anjaneyulu Dega

వీఆర్ఎ ఆత్మహత్యాయత్నం..?

కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా: గత ఆరు రోజులుగా ఆందోళన చేస్తున్నా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఓ వీఆర్ఎ ఆత్మ హత్యాయత్నం చేశారు. కొమురంభీం జిల్లా పెంచికల్ పెట్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట తమకు విధులు కేటాయించాని వీ ఆర్ ఏ లు ఆందోళన చేస్తున్నారు. తాము ప్రభుత్వానికి ఎన్నిమార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తూ ఎల్లూరు పంచాయతీలో విధులు నిర్వహిస్తున్న వి. ఆర్. ఏ. తిరుపతి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నం చేసుకున్నారు. మిగతా వారంతా ఆయనను అడ్డుకున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేయక పోవడం తమను తీవ్రంగా బాధిస్తోందని వీఆర్ఎ లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం వివిధ రూపాల్లో నిరసనలు చేపట్టినా, ప్రభుత్వం స్పందించక పోవడంతో, నిరవధిక సమ్మె చేస్తున్నామని వెల్లడించారు..