Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 30 July 2022, 7:23 pm Posted by : Anjaneyulu Dega

నిజ నిర్ధారణ చేసుకొని నిస్పక్షపాతంగా వార్తా కథనాలు ఉండాలి

మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి

మంచిర్యాల జిల్లా: ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పని చేస్తున్న మీడియా ప్రతినిధులు వార్తా కథనాల విషయంలో నిజ నిర్ధారణ చేసుకొని నిస్పక్షపాతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన నముదాయంలోని కలెక్టర్ చాంబర్ లో 2022-24 సంవత్సరాలకు గాను జిల్లా పౌరసంబంధాల అధికారి వై.సంపత్ కుమార్ తో కలిసి జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులకు అక్రిడిటేషన్లు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు మారుమూల ప్రాంతాలకు సైతం అందడంలో మీడియా ప్రచారం ఎంతో దోహదపడుతుందని, అదే విధంగా సమాజంలో నెలకొన్న నమన్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం చూపడంలో జర్నలిస్టులు విశేష కృషి చేస్తున్నారని తెలిపారు. ఆగస్టు 1వ తేదీ నుండి జిల్లాలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అక్రిడిటేషన్ కార్డులు అందజేయడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు చెట్ల రమేష్, కేశెట్టి వంశీకృష్ణ, తొట్ల మల్లేష్, కల్లు రాజలింగు, రూపిరెడ్డి ప్రకాష్ రెడ్డి, మానిశెట్టి మాంతయ్య, ఈ. రమేష్, గెల్లు నర్సయ్య, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.