ఓటరు కార్డుకు ఆధార్ అనుసంధానం..!
జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ మంచిర్యాల జిల్లా: ఆగస్టు 1వ తేదీ నుండి నూతన ఓటర్ల నమోదుతో పాటు ఓటరు కార్డుకు ఆధార్ అనుసంధానం చేయడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని తహశిల్దార్ కార్యాలయంలో బూత్ స్థాయి అధికారులకు ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఆగస్టు 1వ తేదీ నుండి నూతన ఓటరు నమోదుతో పాటు మార్పులు, చేర్పులు, తొలగింపుల కొరకు భారత...