కేసీఆర్ ను ఓడించకపోతే ఈ జన్మకు సార్ధకత లేదు: ఈటల
హైదరాబాద్: తెరాస అధినేత కేసీఆర్ బొమ్మతో తాను ఎన్నికల్లో గెలవలేదని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "పదవుల కోసం నేను తెలంగాణ ఉద్యమం, తెరాసలో చేరలేదు. నా సొంత పనితీరుతోనే ఎన్నికల్లో గెలుస్తూ వచ్చాను. 2018 ఎన్నికల్లో నన్ను ఓడించాలని కేసీఆర్ కుట్ర పన్నారు. మంత్రిగా ఉన్న నా ఇంట్లోనే ఎన్నికలప్పుడు తనిఖీలు జరిగాయి. నాతో పాటు మరో ముగ్గురు తెరాస నేతల ఓటమికి కుట్ర చేశారు. వారంతా ఓడిపోయారు. నేనొక్కడిని మాత్రమే...