Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 27 July 2022, 6:00 pm Posted by : Anjaneyulu Dega

బస్ ట్రాకింగ్ యాప్ ఆవిష్కరించిన టీఎస్ఆర్టీసీ

ప్రయోగాత్మకంగా 140 బస్సుల అనుసంధానం

హైదరాబాద్: ‘మీరు ఎక్కాల్సిన బస్సు మీరున్న చోటకు ఎప్పుడు వస్తుందో, ఇపుడు ఎక్కడ ఉందో తెలుసుకోవటం ఇక సులభం.. అందుకు అనుగుణంగా ‘టీఎస్ఆర్టీసీ బస్ ట్రాకింగ్’ పేరిట ఆర్టీసీ అధికారులు ప్రత్యేక యాప్ను రూపొందించారు. దాని <span;>సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ఆవిష్కరించినట్లు ఆర్టీసీ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. రాష్ట్రంలోని 96. డిపోల పరిధిలోని ఎంపిక చేసిన 4,170 బస్సులను ఈ యాప్ తో దశలవారీగా అనుసంధానించాలని నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా తొలిదశలో 140 బస్సులను ఆ యాప్ పరిధిలోకి తెచ్చారు. శంషాబాద్ విమానాశ్రయానికి నడిచే వాటితోపాటు దూరప్రాంతాలకు వెళ్లే మరో వంద బస్సులను కూడా యాప్ పరిధిలోకి తీసుకొచ్చారు. దానిలో శ్రీశైలం, విజయవాడ, ఏలూరు, భద్రాచలం, విశాఖపట్నం మార్గాలకు వెళ్లే బస్సుల సమాచారం కూడా తెలుసుకోవచ్చు.

తెలంగాణ ఆర్టీసీకి చెందిన బస్సులు ఇతర రాష్ట్రాల్లో తిరుగుతున్నా ఆ సమాచారాన్ని సైతం యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్, www.tsrtc.telangana.gov.in ల నుంచీ సదరు యాప్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. మహిళల భద్రత, బస్సులు చెడిపోయి ఆగిపోతే (బ్రేక్ డౌన్) ఆ సమాచారాన్నీ యాప్ సాయంతో తెలుసుకోవచ్చునని ఆర్టీసీ ఆ ప్రకటనలో పేర్కొంది..