Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 26 July 2022, 10:45 pm Posted by : Anjaneyulu Dega

ప్రతి ఒక్కరు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి.?

రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్

మంచిర్యాల జిల్లా: జిల్లాలో 18 ఏళ్ళు వయస్సు నిండిన ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు నమోదు చేసుకునేలా అధికార యంత్రాంగం విస్తృత ప్రచారం నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటుకు ఉన్న ఆవశ్యకత, ప్రాధాన్యతను వివరించి అర్హత గల ప్రతి ఒక్కరు తమ వివరాలు నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఈ కార్య క్రమంలో జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి, సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి వరుణ్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, బెల్లంపల్లి రాజస్వ మండల అధికారి శ్యామలాదేవి, ఎన్నికల డి. టి. శ్రీనివాస్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.