ప్రజావాణి సమస్యల పరిష్కారం దిశగా చర్యలు
మంచిర్యాల కలెక్టర్ భారతి హోళ్ళికేరి మంచిర్యాల జిల్లా: ప్రజావాణి కార్యక్రమంలో అందించిన దరఖాస్తులపై ఆయా సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ జరిపి సమస్యల పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలోని కలెక్టర్ చాంబర్లో అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. బెల్లంపల్లి మండలం తాళ్ళగురిజాలకు చెందిన ఉప్పులేటి పెంటయ్య తన తండ్రి పేరిట 75 సం॥లుగా ఉన్న పట్టా భూమిలో నిర్మించిన ఇంటిలో నివాసం ఉంటున్నానని, నా హద్దు చుట్టూ...