Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 24 July 2022, 10:17 pm Posted by : Anjaneyulu Dega

ప్రేమ్ సాగర్ రావుపై విమర్శలు సహించేది లేదు

మంచిర్యాల జిల్లా: సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి, నిరుపేదలకు సహాయం చేస్తూ నిరంతరం ప్రజల్లో మమేకమవుతున్న మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుపై మంచిర్యాల ఎమ్మెల్యే తనయుడు నడిపెల్లి విజిత్ రావు అవాకులు చెవాకులు పేలితే సహించేది లేదని కాంగ్రెస్ నేతలు అన్నారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పీసీసీ మాజీ అధికార ప్రతినిధి చిట్ల సత్యనారాయణ, నస్పూర్ మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు బండారు సుధాకర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే తనయుని హోదాలో విజిత్ రావు రాజ్యాంగేతర శక్తిగా నియోజకవర్గంలో చలామణి అవుతు అశాంతి సృష్టిస్తున్నాడని ఆరోపించారు. ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ నిరంతరం ప్రజలకు సేవ చేయాలనే తపనతో ప్రజల మధ్య తిరుగుతున్న ప్రేమ్ సాగర్ రావును చూసి ఓర్వలేక టిఆర్ఎస్ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని వారు విమర్శించారు. నడిపెల్లి ట్రస్టుకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో విజిత్ రావు వెల్లడించాలని వారు డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు పూదరి తిరుపతి, పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్, నస్పూర్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సుర్మిళ్ళ వేణు, మంచిర్యాల డిప్యూటి ఫ్లోర్ లీడర్లు వేములపల్లి సంజీవ్, మాజిద్, మహిళ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత, ప్రధాన కార్యదర్శి పల్లవి, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సంపత్ రెడ్డి, నియోజకవర్గ అధ్యక్షుడు, కౌన్సిలర్ సల్ల మహేష్, పట్టణ అధ్యక్షుడు షేర్ పవన్, ఓబీసీ సెల్ జిల్లా ఛైర్మెన్ వడ్డే రాజమౌళి, సింగిల్ విండో డైరెక్టర్ తూముల వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.