ప్రభుత్వ నిబంధనలకు లోబడి అనుమతులు మంజూరు
మంచిర్యాల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ మంచిర్యాల జిల్లా: గ్రామపంచాయతీల పరిధిలో చేపట్టే నిర్మాణాలకు సంబంధించి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలోని జిల్లా అదనపు కలెక్టర్ చాంబర్లో జిల్లా పంచాయితీ అధికారి నారాయణరావుతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామాలలో నివాస యోగ్యమైన భూములలో మాత్రమే నిర్మాణాలు చేపట్టాలని, నాలా అనుమతులు ప్రభుత్వ నిబంధనలకు లోబడి మంజూరు చేయడం...