Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 23 July 2022, 7:41 pm Posted by : Anjaneyulu Dega

ప్రభుత్వ నిబంధనలకు లోబడి అనుమతులు మంజూరు

మంచిర్యాల  అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్

మంచిర్యాల జిల్లా: గ్రామపంచాయతీల పరిధిలో చేపట్టే నిర్మాణాలకు సంబంధించి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలోని జిల్లా అదనపు కలెక్టర్ చాంబర్లో జిల్లా పంచాయితీ అధికారి నారాయణరావుతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామాలలో నివాస యోగ్యమైన భూములలో మాత్రమే నిర్మాణాలు చేపట్టాలని, నాలా అనుమతులు ప్రభుత్వ నిబంధనలకు లోబడి మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. నిర్మాణాల కొరకు వచ్చిన దరఖాస్తులను పూర్తి స్థాయిలో పరిశీలించిన అనంతరం అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందని, గ్రామపంచాయతీలో జి + 2 అంతస్తుల వరకు మంజూరు చేసేందుకు పరిధి ఉంటుందని, దరఖాస్తుతో పాటు 14 సం||ల దస్తావేజు అనుబంధ లింక్ డాక్యుమెంట్లను జతపరచాలని తెలిపారు. దరఖాస్తుదారులు మీ-సేవ ద్వారా ఆన్లైన్లో నిర్ణీత ఫార్మాట్లో దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు వివరాలు, జతపరిచిన డాక్యుమెంట్లు అన్ని సరిగ్గా ఉన్నట్లయితే వెంటనే అమనుమతులు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు.