ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి

మంచిర్యాల కలెక్టర్ భారతి హోళ్ళికేరి మంచిర్యాల జిల్లా: వాతావరణ శాఖ సూచన మేరకు వర్షాభావ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం పూర్తి స్థాయి రక్షణ చర్యలతో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి టెలీకాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తహశిల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు ఇతరత్రా అధికారులు వారి పరిధిలో అందుబాటులో ఉండాలని,...