వినాయక విగ్రహాల తయారీ, నిమజ్జనంపై హైకోర్టు కీలక ఆదేశాలు
హైదరాబాద్: వినాయక విగ్రహాల తయారీ, నిమజ్జనంపై స్పష్టతనిస్తూ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ) వినాయక విగ్రహాల తయారీపై నిషేధం లేదని స్పష్టం చేసింది. అయితే, పీవోపీ విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయరాదని ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన నీటి కుంటల్లోనే పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేయాలని తెలిపింది. విగ్రహాల ఎత్తు తక్కువగా ఉండేలా ఉత్తర్వులు ఇవ్వాలన్న ప్రభుత్వ అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. దుర్గామాత విగ్రహాల నిమజ్జనంపై పశ్చిమ బెంగాల్ మార్గదర్శకాలను పరిశీలించాలని...