Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 20 July 2022, 7:44 pm Posted by : anjudega

కుంట నుంచి పాములను తీసి.. విన్యాసాలు

బీహార్: బిహార్ లో నాగ పంచమి వేడుకలు వినూత్నంగా జరిగాయి. సాధారణంగా ఈ పండగ సమయంలో పాములకు పాలు పోసి నాగ దేవతను కొలుస్తారు. కానీ బెగుసరాయ్ జిల్లా మన్సూర్చాక్ మండలం ఆగాపుర్ గ్రామస్థులు మాత్రం ఇందుకు భిన్నం. వేడుకల్లో భాగంగా.. భగత్ అని పిలిచే కొందరు పూజారులు గ్రామంలోని ఓ నీటి కుంట నుంచి పాములను బయటకు తీస్తారు. వాటితో విన్యాసాలు చేస్తారు. మెడకు చుట్టుకొని ఆడిస్తారు.

ఇవేవీ సాధారణ సర్పాలా అంటే కాదు. చాలా వరకు విషపూరితమైనవే అయినా బెదరకుండా భక్తి శ్రద్ధలతో ఈ వేడుకల్లో పాల్గొంటారు..