ముగ్గురు సహచరుల్ని కాల్చి చంపిన పోలీస్.. ఆ తర్వాత..!

దిల్లీ: ఓ పోలీస్ తన ముగ్గురు సహచరులపై కాల్పులు జరిపిన ఘటన ఢిల్లీలో కలకలం రేపింది. ఢిల్లీలోని హైదర్పూర్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ వద్ద పహారా కాస్తున్న సమయంలో ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సిక్కిం పోలీస్ కు చెందిన ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ విభాగానికి చెందిన 32 ఏళ్ల ప్రబిన్ రాయ్ జరిపిన కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మృతిచెందినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో కమాండర్ పింటో నంగయాల్ భుటియా, ఇంద్రాలాల్ ఛెత్రి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. తీవ్ర గాయాలపాలైన ధనంగ్ సుబ్బా...