Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 17 July 2022, 4:33 pm Posted by : Anjaneyulu Dega

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే.?

హైదరాబాద్: వర్షాలు, వరద బీభత్సంతో తెలంగాణ జిల్లాలు అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా గోదావరి పరివాహక జిల్లాలు చిగురుటాకుల్లా వణికిపోయాయి. ఈ క్రమంలో ఆదివారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏరియల్ సర్వే చేశారు. భద్రాచలం నుంచి ఏటూరు నాగారం దిశగా హెలికాఫ్టర్ లో వరద ప్రభావిత ప్రాంతాలను వీక్షించారు. ప్రకృతి విపత్తుతో ఉదృతంగా ప్రవహిస్తున్న గోదావరి, ఇరువైపులా జలమయమైన ప్రాంతాలు, నీటిలో చిక్కుకున్న గ్రామాల పరిస్థితిని పరిశీలించారు.

అనంతరం ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి నదికి సీఎం శాంతి పూజలు చేశారు. భద్రాచలం వంతెనపై నుంచి గోదావరి పరిసరాలను పరిశీలించారు. గోదావరి కరకట్టను కూడా సీఎం వీక్షించారు..